వరంగల్‌లో మాజీ ఓఎస్డీ సుమంత్ తండ్రి ఆత్మహత్యాయత్నం

నిత్యం నిఘా,వరంగల్::.. 40 నిద్రమాత్రలు మింగిన సుబ్రహ్మణ్యం.. పరిస్థితి విషమం మాజీ మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ తండ్రి సుబ్రహ్మణ్యం ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన వరంగల్‌లో కలకలం రేపింది. సుబ్రహ్మణ్యం 40 నిద్రమాత్రలు మింగినట్లు సమాచారం. శుక్రవారం ఉదయం సుబ్రహ్మణ్యం నిద్ర నుంచి లేవకపోవడంతో కుటుంబ సభ్యులు గమనించారు. వెంటనే ఆయనను వరంగల్‌లోని మెడికేర్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం సుబ్రహ్మణ్యం పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించినట్లు సమాచారం. ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడయ్యే అవకాశం ఉంది.