పాలిటెక్నిక్ విద్యకు శాపంగా మారిన జీవో 97ను రద్దు చేయాలి
నిత్యం నిఘా,బ్యూరో:హన్మకొండ: పాలిటెక్నిక్ విద్యకు శాపంగా మారిన జీవో 97ను రద్దు చేయాలి పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఆధార్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు గట్టు యుగేందర్ గౌడ్ డిమాండ్ చేశారు. పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ డెమొక్రటిక్ స్టూడెంట్స్ అసోసియేషన్ హనుమకొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరాహార దీక్షకు ఆయన సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా గట్టు యుగేందర్ గౌడ్ మాట్లాడుతూ.. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని కోరారు. అలాగే పాలిటెక్నిక్ విద్యకు శాపంగా మారిన జీవో నంబర్...