కాంగ్రెస్‌కు భారీ షాక్.. బీఆర్ఎస్‌లోకి 100 మంది

నిత్యం నిఘా,బ్యూరో:భూపాలపల్లి/మొగుళ్లపల్లి:… — ఇప్పలపల్లిలో ఉపసర్పంచ్ కూతురు వినోద్ ఆధ్వర్యంలో భారీ చేరికలు — గండ్ర వెంకటరమణారెడ్డి సమక్షంలో కండువాలు కప్పుకున్న కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలో అధికార కాంగ్రెస్ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పలపల్లి గ్రామ ఉపసర్పంచ్ కూతురు వినోద్ ఆధ్వర్యంలో సుమారు 100 మంది కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి నాయకత్వాన్ని బలపరుస్తూ శుక్రవారం జరిగిన ఈ చేరికలు స్థానికంగా రాజకీయ చర్చకు దారితీశాయి. ఇప్పలపల్లి గ్రామంలో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ చేరికల కార్యక్రమానికి ఆ పార్టీ మండల అధ్యక్షుడు బల్గూరి తిరుపతిరావు అధ్యక్షత...