గ్రామాల్లో నూతన సీఐ విస్తృత పర్యటనలు

నిత్యం నిఘా,బ్యూరో:… ఎల్కతుర్తి ,… — వినాయక నిమజ్జనం ప్రశాంతంగా జరిగేలా ప్రత్యేక భద్రతా చర్యలు — బస్టాండ్‌, కళాశాలలు, వసతి గృహాలు, పారిశ్రామిక ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఎల్కతుర్తి సర్కిల్‌ నూతన సీఐగా బాధ్యతలు స్వీకరించిన కే. శ్రీను సర్కిల్‌ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణపై ప్రత్యేక దృష్టి సారించారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం ఎల్కతుర్తి, ముల్కనూర్‌, వంగర తదితర పోలీస్‌స్టేషన్ల పరిధిలోని గ్రామాల్లో విస్తృతంగా పర్యటిస్తూ పరిస్థితులను స్వయంగా పరిశీలిస్తున్నారు. గ్రామ సర్పంచులు, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ స్థానిక సమస్యలు, శాంతిభద్రతల పరిస్థితిపై ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం వినాయక చవితి ఉత్సవాల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ముందస్తు...