# ఎల్కతుర్తి సహకార సంఘానికి ఎన్నికలు నిర్వహించాలని బీజేపీ డిమాండ్
నిత్యం నిఘా,బ్యూరో (హన్మకొండ/ఎల్కతుర్తి):… — నామినేటెడ్ పాలన వద్దు.. రైతుల చేత ఎన్నుకోబడిన పాలన కావాలి — బీజేపీ మండల అధ్యక్షుడు మంతుర్తి శ్రీకాంత్ యాదవ్ డిమాండ్ ఎల్కతుర్తి విశాల సహకార సంఘానికి ఎన్నికలు నిర్వహించకుండా చైర్మన్, డైరెక్టర్లను నామినేటెడ్ పద్ధతిలో నియమించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని బీజేపీ ఎల్కతుర్తి మండల అధ్యక్షుడు మంతుర్తి శ్రీకాంత్ యాదవ్ అన్నారు. వెంటనే సహకార సంఘానికి ఎన్నికలు నిర్వహించి రైతులు తమ ప్రతినిధులను తామే ఎన్నుకునే అవకాశం కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. సహకార సంఘం పూర్తిగా రైతుల ప్రయోజనాలకు సంబంధించిన సంస్థ అని పేర్కొన్న ఆయన.. రైతులకు తమ ప్రతినిధులను ఎన్నుకునే అవకాశం కల్పించకుండా అధికార పార్టీకి...