కలెక్టర్ ఆదేశాలకే విలువ లేదా..?
నిత్యం నిఘా,బ్యూరో (వరంగల్/సంగెం):… — దశాబ్దాల చెట్ల నరికివేతపై రూ.18 వేల పరిహారంతోనే కథ ముగిసిందా? — 34 చెట్ల నరికివేతపై అధికారుల చర్యలపై అనుమానాలు.. సమగ్ర విచారణకు స్థానికుల డిమాండ్ దశాబ్దాలుగా ప్రజలకు నీడనిస్తూ, పర్యావరణ పరిరక్షణకు దోహదపడిన చెట్లను నరికివేసిన ఘటనలో అధికారుల చర్యలపై ఇప్పుడు అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. జిల్లా కలెక్టర్ స్వయంగా చెట్ల నరికివేతను గమనించి అధికారులను వివరణ కోరిన తర్వాత కేసు నమోదు చేసినట్లు సమాచారం. అయితే అనంతరం కేవలం రూ.18 వేల పరిహారం వసూలుతోనే వ్యవహారం ముగిసిందన్న ప్రచారం స్థానికుల్లో అనుమానాలకు తావిస్తోంది. సంగెం మండల కేంద్రానికి వెళ్లే మార్గంలోని చింతలపల్లి గ్రామ సమీపంలో సుమారు 25...