దంచికొట్టిన వాన.. రైతన్నకు గుండె కోత!
నిత్యం నిఘా ,రఘునాథపల్లి మండలం:.. — పంటను మింగేసిన వాన.. పరిహారం కోసం రైతన్న ఎదురుచూపు! —- రఘునాథపల్లి మండలంలో వరి పొలాలు కొట్టుకుపోయిన వైనం — మంగళిబండ తండాలో రైతులకు తీవ్ర నష్టం.. ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకోలు జనగాం జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు రైతన్నకు గుండె కోత మిగిల్చాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు పంట పొలాలు నీటమునిగి, చేతికొచ్చిన పంటలు దెబ్బతింటుండటంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రఘునాథపల్లి మండలం మంగళిబండ తండా గ్రామంలో సోమవారం ఉదయం కురిసిన భారీ వర్షానికి వరి పొలాల్లోకి పెద్ద ఎత్తున వరదనీరు చేరింది. నీటి ఉధృతికి పలువురు రైతులకు చెందిన వరి...