మహేష్ కుమార్ గౌడ్‌కు ఎర్రబెల్లి స్వర్ణ శుభాకాంక్షలు

నిత్యం నిఘా,బ్యూరో (హైదరాబాద్): — టీపీసీసీ అధ్యక్షుడిగా రెండేళ్లు పూర్తి చేసిన సందర్భంగా సన్మానం — కాంగ్రెస్ బలోపేతానికి ఆయన నాయకత్వం స్ఫూర్తిదాయకం: ఎర్రబెల్లి స్వర్ణ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ రెండేళ్ల పదవీకాలాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా తెలంగాణ ప్రదేశ్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ ఆయనకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. మంగళవారం గాంధీభవన్‌లో మహేష్ కుమార్ గౌడ్‌ను కలిసి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి స్వర్ణ మాట్లాడుతూ.. మహేష్ కుమార్ గౌడ్ నాయకత్వంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతమైందని అన్నారు. పార్టీ కార్యకర్తల్లో నూతన ఉత్సాహాన్ని నింపుతూ, క్షేత్రస్థాయిలో పార్టీని...