స్వయంభు గణపతికే నిత్య పూజలు కరువా..?
నిత్యం నిఘా,వర్ధన్నపేట:.. స్వయంభు గణపతికే నిత్య పూజలు కరువా..? — ఆది పూజ్యుడి ఆలయంలో పూజల నిర్వహణపై నిర్లక్ష్యం ఆరోపణలు — భక్తుల ఆవేదన.. దేవాదాయ శాఖ తీరుపై తీవ్ర అసంతృప్తి , విఘ్నాలను తొలగించే ఆది పూజ్యుడు గణనాథుడికే నిత్య పూజలు కరువయ్యాయా..? వర్ధన్నపేట పట్టణ కేంద్రంలోని ప్రసిద్ధ స్వయంభు గణపతి దేవాలయంలో నిత్య పూజలు, అభిషేకాల నిర్వహణపై నిర్లక్ష్యం చోటుచేసుకుంటోందని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్వయంభువుగా వెలసిన గణపతిని ప్రతిరోజూ భక్తులు భక్తిశ్రద్ధలతో దర్శించుకుంటుంటారు. ఇలాంటి విశిష్ట ఆలయంలో నిత్య పూజా కార్యక్రమాలు, అభిషేకాలు క్రమం తప్పకుండా శాస్త్రోక్తంగా నిర్వహించాల్సి ఉన్నప్పటికీ ఆశించిన స్థాయిలో జరగడం లేదని భక్తులు ఆరోపిస్తున్నారు. ఆలయ...