చాహత్ బాజ్ పాయ్ దిశలో హన్మకొండ అభివృద్ధి!
నిత్యం నిఘా,బ్యూరో (హన్మకొండ):.. * పార్కింగ్, డ్రైనేజీ, తాగునీరు.. పర్యాటక రంగానికి భారీ ప్రణాళికలు , హన్మకొండ నగర రూపురేఖలు మార్చే దిశగా భారీ అభివృద్ధి ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. పెరుగుతున్న ట్రాఫిక్, పార్కింగ్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడంతో పాటు భూగర్భ డ్రైనేజీ, తాగునీటి సరఫరా వ్యవస్థలను బలోపేతం చేయడం, చారిత్రక కట్టడాలు, పర్యాటక ప్రాంతాలకు కొత్త హంగులు అద్దడం వంటి అంశాలకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు హనుమకొండ జిల్లా కలెక్టర్, కుడా వైస్ చైర్మన్ ఐఏఎస్ చాహత్ బాజ్ పాయ్ తెలిపారు. మంగళవారం తన చాంబర్లో డిజిటల్ మీడియా ప్రతినిధులతో నిర్వహించిన చిట్చాట్లో జిల్లా, నగర అభివృద్ధి ప్రణాళికలను ఆమె వెల్లడించారు. అశోక హోటల్ ఎదురుగా...