పల్లె పల్లెల్లో నల్ల నర్సింలు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించాలి

నిత్యం నిఘా,జనగాం జిల్లా:.. — సబ్బండ వర్గాలంతా ఐక్యంగా ముందుకు సాగాలి — అక్టోబర్‌ 2న జనగామలో జరిగే శత జయంతి వేడుకలను విజయవంతం చేయాలి: కటకం నరసింహులు జనగామ సబ్బండ వర్గాల ఆశాజ్యోతి, పద్మశాలి ముద్దుబిడ్డ నల్ల నర్సింలు శత జయంతి వేడుకలను గ్రామగ్రామాన వైభవంగా నిర్వహించాలని మన ఆలోచన–మన సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు కటకం నర్సింహులు పిలుపునిచ్చారు. పార్టీలకు అతీతంగా సబ్బండ వర్గాల ప్రజలు ఐక్యంగా ముందుకు సాగాలని కోరారు. నల్ల నర్సింలు శత జయంతిని పురస్కరించుకుని బుధవారం జనగామ పట్టణంలోని శ్రీభక్త మార్కండేయ ఫంక్షన్‌ హాల్‌లో తెలంగాణ ఉమ్మడి జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. పట్టణ అధ్యక్షుడు దోర్నాల...