తెలంగాణ విలీనంతో భారతదేశంలో అంతర్భాగంగా మారింది
నిత్యం నిఘా,జనగాం:.. ఎర్రబెల్లి దయాకర్రావు.. కేసీఆర్ హయాంలో గిరిజనుల అభివృద్ధికి పెద్దపీట వేశామని వెల్లడి హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమైన సెప్టెంబర్ 17ను పురస్కరించుకుని జనగామ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జాతీయ సమైక్యతా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి దయాకర్రావు మాట్లాడుతూ.. 1948 సెప్టెంబర్ 17 తెలంగాణ చరిత్రలో ప్రత్యేకమైన రోజని అన్నారు. 78 ఏళ్ల క్రితం ఇదే రోజున తెలంగాణ భారతదేశంలో అంతర్భాగంగా మారిందన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన సమయంలో దేశంలో బ్రిటిష్ పాలిత ప్రాంతాలతో పాటు స్వదేశీ సంస్థానాలు కూడా ఉండేవని వివరించారు. నిజాం...