బీసీలకు స్కీంలు కాదు.. రాజకీయ సీట్లు కావాలి!

నిత్యం నిఘా బ్యూరో: ‌ స్థానాలు అందరివీ.. ఒక్క వర్గానికే ఎలా? — అక్టోబర్‌లో పరకాలలో బీసీల బహిరంగ సభ.. ఉమ్మడి వరంగల్‌లో 8 సభల నిర్వహణ బీసీలకు సంక్షేమ పథకాలు మాత్రమే కాకుండా రాజకీయంగా తగిన ప్రాతినిధ్యం, ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలు, అధికారంలో వాటా కల్పించాల్సిన అవసరం ఉందని ఓబీసీ ప్రెసిడెంట్‌, కుడా మాజీ చైర్మన్‌ సంగంరెడ్డి సుందర్‌రాజ్‌ యాదవ్‌ అన్నారు. బీసీలకు న్యాయం జరిగే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. జనరల్‌ స్థానాలు అన్ని వర్గాల వారు పోటీ చేయగలిగినవేనని, అయితే ఆ స్థానాలు ఒకే వర్గానికి పరిమితమైనట్లుగా మారడం సరికాదన్నారు. డబ్బుతో ఓట్లను ప్రభావితం చేసే రాజకీయాలకు స్వస్తి...