భార్యలకు పదవులు.. భర్తలకు పెత్తనాలు!

నిత్యం నిఘా,బ్యూరో:(ములుగు జిల్లా):… — రిజర్వేషన్‌ మహిళలకు రాజకీయ అవకాశం కల్పిస్తే.. తెరవెనుక అధికారం భర్తలదేనా? — మహిళా ప్రజాప్రతినిధుల స్వతంత్రతపై తాడ్వాయి మండలంలో చర్చ.. అధికారుల తీరుపైనా ప్రశ్నలు మహిళలకు రాజకీయాల్లో ప్రాతినిధ్యం కల్పించేందుకు అమలు చేస్తున్న రిజర్వేషన్లు కొందరి వ్యవహారశైలితో తమ లక్ష్యాన్ని కోల్పోతున్నాయనే విమర్శలు ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో వినిపిస్తున్నాయి. కొందరు రాజకీయ నాయకులు రిజర్వేషన్‌ కారణంగా తమ భార్యలను ఎన్నికల బరిలో నిలబెట్టి గెలిపించిన అనంతరం, ప్రజల ముందున్న పదవి భార్యదైనా.. తెరవెనుక వ్యవహారాలన్నీ భర్తలే చక్కబెడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఎన్నికలకు ముందు పెద్దగా ప్రజాక్షేత్రంలో కనిపించని మహిళలు, రిజర్వేషన్‌ కారణంగా అభ్యర్థులుగా తెరపైకి వస్తున్నారని, ఎన్నికల్లో గెలిచిన...