చెన్నారంలో ఎక్సైజ్ దాడులు.. ఆ తర్వాత ఏమైంది?

చెన్నారంలో ఎక్సైజ్ దాడులు.. ఆ తర్వాత ఏమైంది? — బెల్ట్‌షాపులపై తనిఖీలు.. భారీగా మద్యం పట్టుబడినట్లు సమాచారం — పట్టుబడిన మద్యం, కేసుల వివరాలపై నో క్లారిటీ.. మధ్యవర్తిత్వంపై స్థానికంగా చర్చ వర్ధన్నపేట మండలం చెన్నారం గ్రామంలో బెల్ట్‌షాపులపై ఎక్సైజ్‌ అధికారులు నిర్వహించిన దాడులు స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి. అక్రమంగా మద్యం విక్రయిస్తున్నారన్న సమాచారంతో అధికారులు తనిఖీలు చేపట్టగా భారీగా మద్యం పట్టుబడినట్లు సమాచారం. అయితే దాడుల అనంతరం చోటుచేసుకున్న పరిణామాలపై గ్రామస్థుల్లో పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దాడులు జరిగాయి.. మద్యం పట్టుబడినట్లు సమాచారం ఉంది.. కానీ ఎంత మొత్తంలో మద్యం స్వాధీనం చేసుకున్నారు? ఎంత మందిపై కేసులు నమోదు చేశారు? తదుపరి చర్యలు ఏమిటి?...