ఈ నెల 23న గణేష్ ఉత్సవ నిర్వాహకుల సమన్వయ సమావేశం

నిత్యం నిఘా,జనగాం:.. —- మండపాల నిర్వాహకులు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలి — అధికారులతో జేగీయూఎస్ ప్రతినిధుల భేటీ.. ఉత్సవ ఏర్పాట్లపై చర్చ చవితి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని ఈ నెల 23న జనగామ పట్టణంలోని సాయిరాం (కామాక్షి) ఫంక్షన్ హాల్‌లో గణేష్ ఉత్సవ నిర్వాహకుల సమన్వయ సమావేశం నిర్వహించనున్నట్లు జనగామ గణేష్ ఉత్సవ సమితి జిల్లా అధ్యక్షులు మంచాల రవీందర్ తెలిపారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని గణేష్ మండపాల నిర్వాహకులు, భక్తులు, హిందూ బంధువులు పెద్ద సంఖ్యలో హాజరై సమావేశాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. స్థానిక జేగీయూఎస్ కార్యాలయంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ముక్క కుమారస్వామి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో...