# శవానికే రక్షణ లేదా?

నిత్యం నిఘా,వర్ధన్నపేట:.. —వర్ధన్నపేట శవపరీక్ష గదిలో దారుణం.. మృతుడి కంటిని కొరికేసిన ఎలుకలు —ఫ్రీజర్ సౌకర్యం, పారిశుధ్య నిర్వహణపై తీవ్ర ప్రశ్నలు.. అధికారుల తీరుపై బంధువుల ఆగ్రహం వర్ధన్నపేట ప్రభుత్వ వైద్యశాలలని శవపరీక్ష గదిలో దారుణ ఘటన వెలుగుచూసింది. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన రాయపర్తి మండలానికి చెందిన గారే వీరయ్య మృతదేహాన్ని ఎలుకలు కొరికిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఏకంగా మృతుడి కంటి భాగాన్ని ఎలుకలు కొరికేయడంతో కుటుంబ సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆదివారం ఉదయం పోస్టుమార్టం కోసం మృతదేహం వద్దకు వెళ్లిన కుటుంబ సభ్యులు ఈ దృశ్యాన్ని చూసి షాక్‌కు గురయ్యారు. అప్పటికే విషాదంలో ఉన్న కుటుంబానికి ఈ ఘటన...