ప్రైవేట్ ఆసుపత్రుల్లో ‘కమిషన్’ దందా?
రోగులను తీసుకొచ్చే మధ్యవర్తులకు ముందే రేట్లు..? ఆపరేషన్, ప్రసవం, చికిత్సలకూ ‘ఫిక్స్డ్’ కమిషన్ల ఆరోపణలు.. అధికారుల పర్యవేక్షణపై ప్రశ్నలు హనుమకొండ, సెప్టెంబర్ 22 (నిత్యం నిఘా): హనుమకొండ నగరంలోని కొన్ని ప్రైవేట్ ఆసుపత్రుల్లో రోగులను మధ్యవర్తుల ద్వారా తీసుకురావడం, అందుకు ప్రతిఫలంగా కమిషన్లు చెల్లిస్తున్నారనే ఆరోపణలు చర్చనీయాంశంగా మారుతున్నాయి. ముఖ్యంగా బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో కొందరు మధ్యవర్తులు రోగులను ఆసుపత్రులకు తీసుకెళ్లే వ్యవహారం సాగుతోందని స్థానికంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. * చికిత్సకు ఓ రేటు.. ఆపరేషన్కు మరో రేటు? మధ్యవర్తుల ద్వారా ఆసుపత్రులకు వచ్చే రోగులకు సంబంధించి వివిధ రకాల చికిత్సలు, శస్త్రచికిత్సలు, ప్రసవాలకు ముందుగానే నిర్దిష్ట మొత్తాల్లో కమిషన్లు నిర్ణయిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఏ...