కొత్తపల్లిలో భక్తి సందడి.. కుంకుమార్చనకు భారీగా తరలివచ్చిన మహిళలు

నిత్యం నిఘా(వరంగల్/వర్ధన్నపేట):. కోలాటాలతో మార్మోగిన గ్రామం.. ఘనంగా ముగిసిన గణపతి నవరాత్రి ఉత్సవాలు గణపతి నవరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం కొత్తపల్లి గ్రామంలో భక్తి సందడి నెలకొంది. విద్యాజ్యోతి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కుంకుమార్చన కార్యక్రమానికి మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. ఉత్సవాల చివరి రోజు కావడంతో గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. మహిళలు సంప్రదాయబద్ధంగా కుంకుమార్చన నిర్వహించి గణనాథుడిని కొలిచారు. అనంతరం కోలాటాలు ఆడుతూ ఉత్సాహంగా సందడి చేశారు. దీంతో కొత్తపల్లి గ్రామం గణపతి నామస్మరణతో మార్మోగింది. కార్యక్రమంలో మహిళలతో పాటు భక్తులు, గ్రామ పెద్దలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. యూత్ అసోసియేషన్...