పోలీసుల ముందే కోడలిని ఇంట్లో బంధించారా?
నిత్యం నిఘా,హన్మకొండ:.. మూడు రోజులుగా తల్లీకూతుళ్ల నిర్బంధం.. తిండి లేక మనవరాలు అస్వస్థతకు గురైందని కుటుంబం ఆరోపణ అదనపు కట్నం వేధింపుల కేసు.. గతంలో రాజీగా ఇల్లు, దుకాణం రాసిచ్చినట్లు వెల్లడి హన్మకొండలోని రాంనగర్లో ఓ కుటుంబ వివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. తనను, కుమార్తె తేజస్వినిని అత్త మీరాబాయి ఇంట్లో బంధించి తాళం వేసిందని గూడూరు జయశ్రీ ఆరోపించారు. పోలీసులకు సమాచారం ఇచ్చి వారు అక్కడికి వచ్చినప్పటికీ తమను ఇంట్లోనే నిర్బంధించినట్లు బాధితురాలు పేర్కొంది. మూడు రోజులుగా తిండి లేక ఇబ్బందులు పడుతున్నామని, కుమార్తె తేజస్విని కళ్లు తిరిగి పడిపోయిందని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. బాధిత కుటుంబం, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.....