పరకాలలో సహకార పోస్టుల భర్తీ ఎప్పుడో?

నిత్యం నిఘా,పరకాల:. ఉమ్మడి వరంగల్‌లో దాదాపు పూర్తి.. పరకాలలో మాత్రం పడకేసిన ప్రక్రియ ఆశావహుల్లో ఆందోళన.. తమ వంతు కోసం ఎదురుచూపులు పరకాల, సెప్టెంబర్ 25 (నిత్యం నిఘా ప్రతినిధి): పరకాల నియోజకవర్గంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తికాకపోవడంతో ఆశావహుల్లో ఆందోళన నెలకొంది. పదవుల కోసం ఎదురుచూస్తున్న నేతలు తమకు అవకాశం ఎప్పుడు దక్కుతుందోనని ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియ దాదాపుగా పూర్తయినప్పటికీ.. పరకాల నియోజకవర్గంలో మాత్రం ఈ ప్రక్రియ ముందుకు సాగకపోవడం చర్చనీయాంశంగా మారింది. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ, తమకు...