చెప్పులు ధరించి అంబేద్కర్ విగ్రహం వద్దకు వెళ్లడంపై ఎంపీ చామల వివరణ

నిత్యం నిఘా, జనగాం :. తొందరపాటులో అనుకోకుండా జరిగింది.. వెంటనే చెప్పులు తొలగించి నివాళులు సంఘటనపై దళితులు, అంబేద్కర్ అభిమానులకు ఎంపీ హృదయపూర్వక క్షమాపణ. జనగామ నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన భువనగిరి పార్లమెంట్ సభ్యుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అయితే కార్యక్రమం సందర్భంగా తాను తొందరపాటులో పాదరక్షలు తొలగించకుండానే విగ్రహం వద్దకు వెళ్లినట్లు ఆయన తెలిపారు. విషయం గుర్తించిన వెంటనే పాదరక్షలు తొలగించి అంబేద్కర్‌కు భక్తిశ్రద్ధలతో నివాళులు అర్పించినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనపై ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి స్పందిస్తూ, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ పట్ల తనకు...