సీకేఎం ఆసుపత్రిలో కుక్కల బెడద
నిత్యం నిఘా,వరంగల్: ఆసుపత్రి ప్రాంగణంలో యథేచ్ఛగా సంచరిస్తున్న వీధి కుక్కలు రోగులు, సహాయకుల్లో ఆందోళన.. ఆసుపత్రి యాజమాన్యం స్పందించాలని డిమాండ్ వరంగల్లోని సీకేఎం ఆసుపత్రిలో వీధి కుక్కల బెడద రోగులు, వారి సహాయకులకు ఆందోళన కలిగిస్తోంది. ఆసుపత్రి ప్రాంగణంలోకి కుక్కలు యథేచ్ఛగా ప్రవేశించి సంచరిస్తుండటంతో రోగులు, వారి వెంట వచ్చే కుటుంబ సభ్యులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. ఆసుపత్రికి ప్రతిరోజూ పెద్ద సంఖ్యలో రోగులు, వారి సహాయకులు వస్తుంటారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో కుక్కలు గుంపులుగా సంచరిస్తుండటంతో ఆసుపత్రి ప్రాంగణంలో భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది. చిన్నపిల్లలు, వృద్ధులు, రోగులు కుక్కల బారిన పడే ప్రమాదం ఉందని పలువురు పేర్కొంటున్నారు. ఆసుపత్రి పరిసరాల్లో చెత్త, ఆహార వ్యర్థాలు...