కస్తూర్బా పాఠశాలలో వేడినీళ్ల ప్రమాదం!
నిత్యం నిఘా ,(వర్ధన్నపేట/ ఇల్లంద):. వంట సిబ్బందిపై ఒక్కసారిగా వేడినీళ్లు.. తీవ్ర గాయాలు ఇల్లంద కస్తూర్బా పాఠశాలలో ఘటన.. హుటాహుటిన ఆసుపత్రికి తరలింపు ఇల్లందలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో వంట సిబ్బందికి అనుకోని ప్రమాదం చోటుచేసుకుంది. వంట పనులు నిర్వహిస్తున్న సమయంలో విజయలక్ష్మిపై ప్రమాదవశాత్తు వేడినీళ్లు పడటంతో ఆమె తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. దీంతో పాఠశాలలో ఒక్కసారిగా కలకలం నెలకొంది. వేడినీళ్లు పడటంతో గాయపడిన విజయలక్ష్మిని తోటి సిబ్బంది వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమెకు వైద్యులు చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. — ప్రమాదానికి కారణమేంటి? వంటగదిలో వేడినీళ్లు పడిన ఘటనకు గల పూర్తి కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ప్రమాదం ఏ విధంగా...