ఓటమితో ఆగలేదు.. ప్రజల మధ్యే నా పోరాటం!
నిత్యం నిఘా,బ్యూరో (హన్మకొండ): చట్టసభకు దూరమైనా.. జనసభలో పోరాటం కొనసాగిస్తున్నా! నిరుద్యోగ సమస్యకు నిర్దిష్ట జాబ్ క్యాలెండర్ అవసరం: బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేష్రెడ్డి ఎన్నికల్లో గెలుపోటములు రాజకీయ ప్రయాణంలో సహజమేనని, అయితే ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడటమే తన లక్ష్యమని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేష్రెడ్డి అన్నారు. గత పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోయినా నిరాశ చెందలేదని, చట్టసభలో అడుగుపెట్టే అవకాశం రాకపోయినా జనసభలో ప్రజలతో కలిసి పనిచేసే అవకాశం లభించిందని తెలిపారు. ‘‘గో హెడ్ రాకేష్’’ అంటూ పార్టీ అధినేత కేసీఆర్ ఇచ్చిన స్ఫూర్తితో గత రెండున్నరేళ్లుగా ఉమ్మడి వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాల్లోని 34 నియోజకవర్గాల్లో...