ప్రజలే నా బలం.. పనితీరే నా గుర్తింపు
రాజకీయ ప్రస్థానంలో ఎన్నో సవాళ్లు.. వెనక్కి తగ్గలేదు 13 ఏళ్ల డీసీసీ అధ్యక్ష పదవి నుంచి భూపాలపల్లి రాజకీయాల దాకా నా పనితీరే నా ఎదుగుదలకు కారణం.. భూపాలపల్లే నా కుటుంబం: గండ్ర వెంకటరమణారెడ్డి రాజకీయాల్లో గెలుపోటములు సహజమని, ప్రజల కోసం చేసిన పనులు, ఎదుర్కొన్న పోరాటాలే తన రాజకీయ ప్రస్థానానికి పునాది అని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. తన రాజకీయ జీవితంలో ఎన్నో కుట్రలు ఎదురైనా వెనక్కి తగ్గలేదని, తన పనితీరే తన ఎదుగుదలకు కారణమైందని పేర్కొన్నారు. భూపాలపల్లి నియోజకవర్గాన్ని తన కుటుంబంగా భావించి అభివృద్ధి కోసం పనిచేశానని, మరోసారి ప్రజల ఆశీర్వాదం లభిస్తే నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు...