తలవంచలేదు.. పోరాటాన్నే వీడలేదు
నిత్యం నిఘా,బ్యూరో (హన్మకొండ): తలవంచలేదు.. పోరాటాన్నే వీడలేదు ఉద్యమంలో ముందున్నా.. స్వరాష్ట్రంలో అధికారానికి దూరమయ్యా ఉద్యమం నుంచి న్యాయస్థానం వరకు : గుడిమళ్ళ రవికుమార్ ప్రస్థానం తలవంచి బతకడం తనకు తెలియదని, సమస్యలను ప్రశ్నిస్తూ ఎదురిస్తూ జీవితాన్ని కొనసాగించానని తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక రాష్ట్ర చైర్మన్ గుడిమళ్ళ రవికుమార్ అన్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన తనలాంటి ఉద్యమకారులకు స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత రాజకీయ, అధికార వ్యవస్థల్లో తగిన భాగస్వామ్యం ఎందుకు లభించలేదన్నదే తన ప్రశ్న అని పేర్కొన్నారు. ఉద్యమకారులకు గుర్తింపు, న్యాయం దక్కలేదన్న భావనతోనే మరోసారి పోరాటం చేపట్టాల్సి వచ్చిందన్నారు. తెలంగాణ డిజిటల్ మీడియా ప్రతినిధులతో నిర్వహించిన చిట్చాట్లో గుడిమళ్ళ రవికుమార్ తన...