జర్నలిస్టుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి

నిత్యం నిఘా,హన్మకొండ:. జర్నలిస్టుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి డిజిటల్ మీడియా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలి జర్నలిస్టుల హక్కులు, భద్రత, సంక్షేమానికి సంబంధించిన దీర్ఘకాలిక సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని తెలంగాణ డిజిటల్ మీడియా యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ఆరెల్లి కిరణ్‌కుమార్ డిమాండ్ చేశారు. సమాజంలో డిజిటల్ మీడియా విస్తరిస్తున్న నేపథ్యంలో మీడియా రంగానికి సంబంధించిన విధానపరమైన సిఫార్సుల కోసం ప్రత్యేకంగా కొత్త మీడియా కమిషన్‌ను ఏర్పాటు చేయాలని కోరారు. శుక్రవారం హన్మకొండలో నిర్వహించిన యూనియన్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ జర్నలిస్టుల భద్రతకు ప్రత్యేక కేంద్ర చట్టాన్ని తీసుకురావాలని, ముద్రణ, ప్రసార, డిజిటల్ మీడియా ఉద్యోగులకు వర్తించేలా కొత్త వేతన బోర్డును వెంటనే ఏర్పాటు చేయాలని...