తెలంగాణ అస్తిత్వ పరిరక్షణకు పోరాటం
నిత్యం నిఘా,బ్యూరో: మామునూరు విమానాశ్రయానికి ప్రొఫెసర్ జయశంకర్ పేరు పెట్టాలని డిమాండ్ తెలంగాణ వనరులు, నీళ్లు, ఉద్యోగాలపై జరుగుతున్న అన్యాయాన్ని అడ్డుకోవాలి: తెలంగాణ అస్తిత్వ వేదిక తెలంగాణలో స్వయం పాలన పోయి పరాయి పాలన వచ్చిందని, రాష్ట్రం మనదే అయినా పాలన మాత్రం ఆంధ్రా కనుసన్నల్లో కొనసాగుతోందని తెలంగాణ అస్తిత్వ వేదిక చైర్మన్ వీరమళ్ల ప్రకాష్ ఆరోపించారు. తెలంగాణ అస్తిత్వ పరిరక్షణ కోసం వరంగల్ నుంచే మరో ఉద్యమానికి శ్రీకారం చుడతామని ప్రకటించారు. ఓబీసీ చైర్మన్, కుడా మాజీ చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్ ఆధ్వర్యంలో శుక్రవారం హనుమకొండ హంటర్ రోడ్డులోని మాస్టర్జీ డిగ్రీ, పీజీ కళాశాల ఆడిటోరియంలో తెలంగాణ అస్తిత్వ వేదిక రాష్ట్రస్థాయి సమావేశం...