ములుగు జిల్లా అదనపు ఎస్పీ కారును ఢీకొట్టిన టిప్పర్
నిత్యం నిఘా, ములుగు:. తృటిలో తప్పిన ప్రమాదం.. కారు ముందు భాగం ధ్వంసం ములుగు జిల్లా ఏఆర్ అదనపు ఎస్పీ సదానందం గౌడ్ ప్రయాణిస్తున్న కారును టిప్పర్ ఢీకొన్న ఘటనలో తృటిలో ప్రమాదం తప్పింది. జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయం నుంచి బయటకు వస్తున్న సమయంలో బండారుపల్లి వైపు నుంచి ములుగు వైపు వేగంగా వస్తున్న టిప్పర్ అదనపు ఎస్పీ కారును ఢీకొట్టినట్లు సమాచారం. ఈ ఘటనలో కారు ముందు భాగం దెబ్బతింది. కారులో ఉన్న అదనపు ఎస్పీ సదానందంతో పాటు డ్రైవర్, సిబ్బందికి ఎలాంటి గాయాలు కాలేదని తెలిసింది. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ప్రమాద స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ప్రమాదానికి...