కష్టాల కొలిమిలో కరిగిన ప్రస్థానం.. యాదగిరిగౌడ్‌ మనసులో మాట

నిత్యం నిఘా, బ్యూరో (హన్మకొండ):.. పుట్టినరోజు సందర్భంగా ‘నిత్యం నిఘా’తో తన జీవిత ప్రయాణాన్ని పంచుకున్న బొనగాని యాదగిరిగౌడ్‌ సాధారణ కుటుంబంలో జన్మించి.. కష్టాలను ఎదుర్కొంటూ ముందుకు సాగారు. చదువుకున్నారు.. కాంట్రాక్టర్‌గా పనిచేశారు.. ఎల్‌ఐసీ ఏజెంట్‌గా ప్రజలకు చేరువయ్యారు. రాజకీయాల్లోకి అడుగుపెట్టి కాంగ్రెస్‌ పార్టీని నమ్ముకున్నారు. పదవులు, గుర్తింపు కోసం ఎదురుచూస్తూనే పార్టీ కోసం పనిచేశారు. మరోవైపు గౌడ కులస్తుల సమస్యలపై తనవంతు పోరాటం చేస్తూ ముందుకు సాగారు. ఆయనే బొనగాని యాదగిరిగౌడ్‌. ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా ‘నిత్యం నిఘా’ పలకరించింది. సాధారణంగా పుట్టినరోజు అంటే శుభాకాంక్షలు, సంబరాలు, వేడుకలు. కానీ యాదగిరిగౌడ్‌తో మాట్లాడినప్పుడు ఆయన మాటల్లో ఆనందం కంటే జీవితంలో ఎదురైన కష్టాలు,...