అక్టోబర్‌ 6న చలో హైదరాబాద్

నిత్యం నిఘా,ఎల్కతుర్తి ఎంఎస్‌ఎఫ్‌ జాతీయ ప్రతినిధుల మహాసభను విజయవంతం చేయాలి హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్‌ కళాశాలలో అక్టోబర్‌ 6న నిర్వహించనున్న ఎంఎస్‌ఎఫ్‌ జాతీయ ప్రతినిధుల మహాసభను విజయవంతం చేయాలని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షులు, పద్మశ్రీ మందకృష్ణ మాదిగ పిలుపునిచ్చారు. ఎమ్మార్పీఎస్‌ ఎల్కతుర్తి మండల అధ్యక్షులు అడ్డూరి అనిల్‌ మాదిగ ఆదేశాల మేరకు శనివారం ఎల్కతుర్తి మండల కేంద్రంలో ఎంఎస్‌ఎఫ్‌ నాయకులు, విద్యార్థులు, కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అక్టోబర్‌ 6న చేపట్టనున్న చలో హైదరాబాద్‌ కార్యక్రమానికి సంబంధించిన కార్యాచరణపై చర్చించారు. ఎంఎస్‌ఎఫ్‌ ఎల్కతుర్తి మండల అధ్యక్షులు గొల్లమందల చరణ్‌ మాదిగ మాట్లాడుతూ విద్యార్థుల సమస్యలు, హక్కులు, విద్యారంగానికి సంబంధించిన అంశాలతో పాటు భవిష్యత్‌...