తాళ్లరాంపూర్‌లో సాంఘిక బహిష్కరణపై గౌడ సంఘాల ఆగ్రహం

నిత్యం నిఘా,హైదరాబాద్:. భూములు లాక్కుంటే అడ్డుకోవడమే నేరమా? గీత కార్మికులకు రక్షణ కల్పించాలి.. గౌడ సంఘాల జేఏసీ నిజామాబాద్‌ జిల్లా ఏర్గట్ల మండలం తాళ్లరాంపూర్‌ గ్రామంలో గౌడ కులస్తులు, దళిత గీత కార్మికులపై దాడులు, సాంఘిక బహిష్కరణకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ గౌడ సంఘాల జేఏసీ, జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కమిటీ, మోకుదెబ్బ రాష్ట్ర కమిటీలు డిమాండ్‌ చేశాయి. బాధితులకు రక్షణ కల్పించడంతో పాటు గ్రామ అభివృద్ధి కమిటీల పేరుతో చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే చర్యలను అరికట్టాలని కోరాయి. హైదరాబాద్‌లోని మోకుదెబ్బ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో తెలంగాణ గౌడ సంఘాల జేఏసీ రాష్ట్ర చైర్మన్‌ అమరవేణి నర్సాగౌడ్‌,...