“జన తెలంగాణ” దిశగా కొత్త రాజకీయ అడుగు
నిత్యం నిఘా బ్యూరో: ప్రజా సమస్యలే మా ఎజెండా.. విద్య, వైద్యం, ఉపాధిపై పోరాటం కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా రాజకీయ వేదిక ఉమ్మడి జిల్లాల కేంద్రంగా సన్నాహక సమావేశాలు.. రెండు మూడు నెలల్లో పార్టీ పేరు ఖరారు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి సన్నాహాలు మాజీ మావోయిస్టు నేత, తెలంగాణ ఉద్యమకారుడు లంకా పాపిరెడ్డి తెలంగాణ రాష్ట్రం ఏర్పడినా ప్రజలు ఆశించిన మార్పు పూర్తిస్థాయిలో రాలేదని, ప్రత్యేక రాష్ట్రం కోసం చేసిన త్యాగాల ఆకాంక్షలు నెరవేరలేదని మాజీ మావోయిస్టు నేత, తెలంగాణ ఉద్యమకారుడు లంకా పాపిరెడ్డి అన్నారు. ప్రజల మౌలిక సమస్యలైన విద్య, వైద్యం, ఉపాధిని కేంద్రంగా చేసుకుని కొత్త రాజకీయ వేదికను నిర్మించనున్నట్లు...