పల్లె సీను సాహిత్యం భవిష్యత్ తరాలకు అమూల్యమైన సంపద
నిత్యం నిఘా ,బ్యూరో(హన్మకొండ):.. రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ డా. రియాజ్ ఘనంగా పల్లె సీను ఐదు పుస్తకాల ఆవిష్కరణోత్సవం కవి, రచయిత పల్లె సీను రచనలు భవిష్యత్ తరాలకు అమూల్యమైన సాహితీ సంపదగా నిలుస్తాయని తెలంగాణ రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ డా. రియాజ్ అన్నారు. తన చిన్ననాటి గురువైన పల్లె సీను సాహిత్యం భావితరాలకు గొప్ప మార్గదర్శకంగా నిలుస్తుందని పేర్కొన్నారు. పల్లె సీను సహస్ర చంద్ర దర్శన వేళ ఆయన రచించిన ఐదు పుస్తకాల ఆవిష్కరణోత్సవం హనుమకొండలోని హరిత కాకతీయలో ఘనంగా జరిగింది. శ్రీలేఖ సాహితి సంస్థ వరంగల్ స్వర్ణోత్సవ సంవత్సరాన్ని పురస్కరించుకొని నిర్వహించిన ఈ కార్యక్రమానికి డా. రియాజ్ విశిష్ట అతిథిగా...