వన్యప్రాణుల వేటగాళ్లపై అటవీశాఖ ఉక్కుపాదం

నిత్యం నిఘా,ఏటూర్ నాగారం: వన్యప్రాణుల వేటగాళ్లపై అటవీశాఖ ఉక్కుపాదం కెమెరాల నిఘాలో చిక్కిన ఏడుగురు.. ఐదుగురికి 14 రోజుల రిమాండ్ ఇద్దరు పరారీలో.. ఖమ్మం కేంద్ర కారాగారానికి తరలింపు ఏటూరునాగారం అభయారణ్యంలో వన్యప్రాణులను వేటాడుతున్న వారిపై అటవీశాఖ అధికారులు కఠిన చర్యలు చేపట్టారు. అభయారణ్యంలో ఏర్పాటు చేసిన నిఘా కెమెరాల్లో చిక్కిన వేటగాళ్లను గుర్తించి విచారించగా మొత్తం ఏడుగురు ఈ నేరానికి పాల్పడినట్లు తేలిందని వన్యప్రాణుల క్షేత్రాధికారి హాట్కర్ రమేష్ వెల్లడించారు. ఈ కేసులో ఐదుగురిని అదుపులోకి తీసుకొని ములుగు న్యాయస్థానంలో హాజరుపరచగా, న్యాయమూర్తి వారికి 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో వారిని ఖమ్మం కేంద్ర కారాగారానికి తరలించినట్లు తెలిపారు. మరో ఇద్దరు నిందితులు...