ఇందిరమ్మ ఇంట్లో కాంగ్రెస్ నాయకుల దీపావళి సంబరాలు

నిత్యం నిఘా,హన్మకొండ/ఎల్కతుర్తి : ఇందిరమ్మ ఇంట్లో కాంగ్రెస్ నాయకుల దీపావళి సంబరాలు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఇంటికి వెళ్లి నూతన వస్త్రాల అందజేత.. కుటుంబ సభ్యులతో కలిసి పండుగ వేడుకలు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో కలిసి దీపావళి పండుగను జరుపుకునే లక్ష్యంతో జగన్నాధపూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పండుగ సంబరాలను ఘనంగా నిర్వహించారు. గ్రామ శాఖ అధ్యక్షుడు ముస్కే శ్రీనివాస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు గ్రామానికి చెందిన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు గుండాల భాగ్యలక్ష్మి–మధు నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులతో ఆనందంగా పండుగను జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారికి నూతన వస్త్రాలను అందజేసి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి...