Home

పల్లె సీను సాహిత్యం భవిష్యత్ తరాలకు అమూల్యమైన సంపద

నిత్యం నిఘా ,బ్యూరో(హన్మకొండ):.. రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ డా. రియాజ్ ఘనంగా పల్లె సీను ఐదు పుస్తకాల ఆవిష్కరణోత్సవం కవి, రచయిత పల్లె సీను రచనలు భవిష్యత్ తరాలకు అమూల్యమైన సాహితీ సంపదగా నిలుస్తాయని తెలంగాణ రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ డా. రియాజ్ అన్నారు. తన చిన్ననాటి గురువైన పల్లె సీను సాహిత్యం భావితరాలకు గొప్ప మార్గదర్శకంగా నిలుస్తుందని పేర్కొన్నారు. పల్లె సీను సహస్ర చంద్ర దర్శన వేళ ఆయన రచించిన ఐదు పుస్తకాల ఆవిష్కరణోత్సవం హనుమకొండలోని హరిత కాకతీయలో ఘనంగా...

“జన తెలంగాణ” దిశగా కొత్త రాజకీయ అడుగు

నిత్యం నిఘా బ్యూరో: ప్రజా సమస్యలే మా ఎజెండా.. విద్య, వైద్యం, ఉపాధిపై పోరాటం కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా రాజకీయ వేదిక ఉమ్మడి జిల్లాల కేంద్రంగా సన్నాహక సమావేశాలు.. రెండు మూడు నెలల్లో పార్టీ పేరు ఖరారు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి సన్నాహాలు మాజీ మావోయిస్టు నేత, తెలంగాణ ఉద్యమకారుడు లంకా పాపిరెడ్డి తెలంగాణ రాష్ట్రం ఏర్పడినా ప్రజలు ఆశించిన మార్పు పూర్తిస్థాయిలో రాలేదని, ప్రత్యేక రాష్ట్రం కోసం చేసిన త్యాగాల ఆకాంక్షలు నెరవేరలేదని మాజీ మావోయిస్టు నేత, తెలంగాణ ఉద్యమకారుడు...

*వర్ధన్నపేటలో కలకలం.. చైర్మన్ ఇంటి ముందు యువతి నిరసన!*

నిత్యం నిఘా, వర్ధన్నపేట:. *“ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడు” అంటూ యువతి ఆరోపణలు* *న్యాయం చేయాలంటూ కుల, మహిళా సంఘాలు–ప్రతిపక్ష నాయకులతో కలిసి ఆందోళన వర్ధన్నపేటలో ఓ యువతి చేసిన ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. వర్ధన్నపేట మున్సిపల్ చైర్మన్ పాలకుర్తి సారంగపాణి కుమారుడు పాలకుర్తి శ్రీకాంత్ ప్రేమించి వివాహం చేసుకుంటానని చెప్పి తనను మోసం చేశాడని ఆరోపిస్తూ తుమ్మల శ్రీదేవి ఆందోళనకు దిగారు. తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ కుల సంఘాలు, మహిళా సంఘాలు, ప్రతిపక్ష నాయకులతో కలిసి చైర్మన్...

తాళ్లరాంపూర్‌లో సాంఘిక బహిష్కరణపై గౌడ సంఘాల ఆగ్రహం

నిత్యం నిఘా,హైదరాబాద్:. భూములు లాక్కుంటే అడ్డుకోవడమే నేరమా? గీత కార్మికులకు రక్షణ కల్పించాలి.. గౌడ సంఘాల జేఏసీ నిజామాబాద్‌ జిల్లా ఏర్గట్ల మండలం తాళ్లరాంపూర్‌ గ్రామంలో గౌడ కులస్తులు, దళిత గీత కార్మికులపై దాడులు, సాంఘిక బహిష్కరణకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ గౌడ సంఘాల జేఏసీ, జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కమిటీ, మోకుదెబ్బ రాష్ట్ర కమిటీలు డిమాండ్‌ చేశాయి. బాధితులకు రక్షణ కల్పించడంతో పాటు గ్రామ అభివృద్ధి కమిటీల పేరుతో చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే చర్యలను అరికట్టాలని...

అక్టోబర్‌ 6న చలో హైదరాబాద్

నిత్యం నిఘా,ఎల్కతుర్తి ఎంఎస్‌ఎఫ్‌ జాతీయ ప్రతినిధుల మహాసభను విజయవంతం చేయాలి హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్‌ కళాశాలలో అక్టోబర్‌ 6న నిర్వహించనున్న ఎంఎస్‌ఎఫ్‌ జాతీయ ప్రతినిధుల మహాసభను విజయవంతం చేయాలని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షులు, పద్మశ్రీ మందకృష్ణ మాదిగ పిలుపునిచ్చారు. ఎమ్మార్పీఎస్‌ ఎల్కతుర్తి మండల అధ్యక్షులు అడ్డూరి అనిల్‌ మాదిగ ఆదేశాల మేరకు శనివారం ఎల్కతుర్తి మండల కేంద్రంలో ఎంఎస్‌ఎఫ్‌ నాయకులు, విద్యార్థులు, కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అక్టోబర్‌ 6న చేపట్టనున్న చలో హైదరాబాద్‌ కార్యక్రమానికి సంబంధించిన కార్యాచరణపై చర్చించారు. ఎంఎస్‌ఎఫ్‌...

కష్టాల కొలిమిలో కరిగిన ప్రస్థానం.. యాదగిరిగౌడ్‌ మనసులో మాట

నిత్యం నిఘా, బ్యూరో (హన్మకొండ):.. పుట్టినరోజు సందర్భంగా ‘నిత్యం నిఘా’తో తన జీవిత ప్రయాణాన్ని పంచుకున్న బొనగాని యాదగిరిగౌడ్‌ సాధారణ కుటుంబంలో జన్మించి.. కష్టాలను ఎదుర్కొంటూ ముందుకు సాగారు. చదువుకున్నారు.. కాంట్రాక్టర్‌గా పనిచేశారు.. ఎల్‌ఐసీ ఏజెంట్‌గా ప్రజలకు చేరువయ్యారు. రాజకీయాల్లోకి అడుగుపెట్టి కాంగ్రెస్‌ పార్టీని నమ్ముకున్నారు. పదవులు, గుర్తింపు కోసం ఎదురుచూస్తూనే పార్టీ కోసం పనిచేశారు. మరోవైపు గౌడ కులస్తుల సమస్యలపై తనవంతు పోరాటం చేస్తూ ముందుకు సాగారు. ఆయనే బొనగాని యాదగిరిగౌడ్‌. ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా ‘నిత్యం నిఘా’ పలకరించింది. సాధారణంగా...

ములుగు జిల్లా అదనపు ఎస్పీ కారును ఢీకొట్టిన టిప్పర్

నిత్యం నిఘా, ములుగు:. తృటిలో తప్పిన ప్రమాదం.. కారు ముందు భాగం ధ్వంసం ములుగు జిల్లా ఏఆర్ అదనపు ఎస్పీ సదానందం గౌడ్ ప్రయాణిస్తున్న కారును టిప్పర్ ఢీకొన్న ఘటనలో తృటిలో ప్రమాదం తప్పింది. జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయం నుంచి బయటకు వస్తున్న సమయంలో బండారుపల్లి వైపు నుంచి ములుగు వైపు వేగంగా వస్తున్న టిప్పర్ అదనపు ఎస్పీ కారును ఢీకొట్టినట్లు సమాచారం. ఈ ఘటనలో కారు ముందు భాగం దెబ్బతింది. కారులో ఉన్న అదనపు ఎస్పీ సదానందంతో పాటు డ్రైవర్, సిబ్బందికి...

తెలంగాణ అస్తిత్వ పరిరక్షణకు పోరాటం

నిత్యం నిఘా,బ్యూరో: మామునూరు విమానాశ్రయానికి ప్రొఫెసర్‌ జయశంకర్‌ పేరు పెట్టాలని డిమాండ్‌ తెలంగాణ వనరులు, నీళ్లు, ఉద్యోగాలపై జరుగుతున్న అన్యాయాన్ని అడ్డుకోవాలి: తెలంగాణ అస్తిత్వ వేదిక తెలంగాణలో స్వయం పాలన పోయి పరాయి పాలన వచ్చిందని, రాష్ట్రం మనదే అయినా పాలన మాత్రం ఆంధ్రా కనుసన్నల్లో కొనసాగుతోందని తెలంగాణ అస్తిత్వ వేదిక చైర్మన్‌ వీరమళ్ల ప్రకాష్‌ ఆరోపించారు. తెలంగాణ అస్తిత్వ పరిరక్షణ కోసం వరంగల్‌ నుంచే మరో ఉద్యమానికి శ్రీకారం చుడతామని ప్రకటించారు. ఓబీసీ చైర్మన్‌, కుడా మాజీ చైర్మన్‌ సుందర్‌ రాజ్‌ యాదవ్‌...

జర్నలిస్టుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి

నిత్యం నిఘా,హన్మకొండ:. జర్నలిస్టుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి డిజిటల్ మీడియా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలి జర్నలిస్టుల హక్కులు, భద్రత, సంక్షేమానికి సంబంధించిన దీర్ఘకాలిక సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని తెలంగాణ డిజిటల్ మీడియా యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ఆరెల్లి కిరణ్‌కుమార్ డిమాండ్ చేశారు. సమాజంలో డిజిటల్ మీడియా విస్తరిస్తున్న నేపథ్యంలో మీడియా రంగానికి సంబంధించిన విధానపరమైన సిఫార్సుల కోసం ప్రత్యేకంగా కొత్త మీడియా కమిషన్‌ను ఏర్పాటు చేయాలని కోరారు. శుక్రవారం హన్మకొండలో నిర్వహించిన యూనియన్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ జర్నలిస్టుల భద్రతకు ప్రత్యేక...

తలవంచలేదు.. పోరాటాన్నే వీడలేదు

నిత్యం నిఘా,బ్యూరో (హన్మకొండ): తలవంచలేదు.. పోరాటాన్నే వీడలేదు ఉద్యమంలో ముందున్నా.. స్వరాష్ట్రంలో అధికారానికి దూరమయ్యా ఉద్యమం నుంచి న్యాయస్థానం వరకు : గుడిమళ్ళ రవికుమార్ ప్రస్థానం ‌ తలవంచి బతకడం తనకు తెలియదని, సమస్యలను ప్రశ్నిస్తూ ఎదురిస్తూ జీవితాన్ని కొనసాగించానని తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక రాష్ట్ర చైర్మన్‌ గుడిమళ్ళ రవికుమార్‌ అన్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన తనలాంటి ఉద్యమకారులకు స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత రాజకీయ, అధికార వ్యవస్థల్లో తగిన భాగస్వామ్యం ఎందుకు లభించలేదన్నదే తన ప్రశ్న అని పేర్కొన్నారు. ఉద్యమకారులకు గుర్తింపు, న్యాయం...

ప్రజలే నా బలం.. పనితీరే నా గుర్తింపు

రాజకీయ ప్రస్థానంలో ఎన్నో సవాళ్లు.. వెనక్కి తగ్గలేదు 13 ఏళ్ల డీసీసీ అధ్యక్ష పదవి నుంచి భూపాలపల్లి రాజకీయాల దాకా నా పనితీరే నా ఎదుగుదలకు కారణం.. భూపాలపల్లే నా కుటుంబం: గండ్ర వెంకటరమణారెడ్డి రాజకీయాల్లో గెలుపోటములు సహజమని, ప్రజల కోసం చేసిన పనులు, ఎదుర్కొన్న పోరాటాలే తన రాజకీయ ప్రస్థానానికి పునాది అని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. తన రాజకీయ జీవితంలో ఎన్నో కుట్రలు ఎదురైనా వెనక్కి తగ్గలేదని, తన పనితీరే తన ఎదుగుదలకు కారణమైందని పేర్కొన్నారు. భూపాలపల్లి...

ఓటమితో ఆగలేదు.. ప్రజల మధ్యే నా పోరాటం!

నిత్యం నిఘా,బ్యూరో (హన్మకొండ): చట్టసభకు దూరమైనా.. జనసభలో పోరాటం కొనసాగిస్తున్నా! నిరుద్యోగ సమస్యకు నిర్దిష్ట జాబ్‌ క్యాలెండర్‌ అవసరం: బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేష్‌రెడ్డి ఎన్నికల్లో గెలుపోటములు రాజకీయ ప్రయాణంలో సహజమేనని, అయితే ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడటమే తన లక్ష్యమని బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేష్‌రెడ్డి అన్నారు. గత పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోయినా నిరాశ చెందలేదని, చట్టసభలో అడుగుపెట్టే అవకాశం రాకపోయినా జనసభలో ప్రజలతో కలిసి పనిచేసే అవకాశం లభించిందని తెలిపారు. ‘‘గో హెడ్‌ రాకేష్‌’’...

వర్ధన్నపేటలో గంజాయి కలకలం...పోలీసుల అదుపులో ఇద్దరు గంజాయి నిందితులు

నిత్యం నిఘా,వర్ధన్నపేట:.. చాకచక్యంగా పట్టుకున్న వర్ధన్నపేట పోలీసులు.. ముమ్మరంగా విచారణ. వర్ధన్నపేట పట్టణంలో గంజాయి వ్యవహారం కలకలం రేపుతోంది. గంజాయి అక్రమ రవాణా, విక్రయాలకు సంబంధించి ఇద్దరు అనుమానితులను వర్ధన్నపేట పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. విశ్వసనీయ సమాచారం ఆధారంగా పోలీసులు చాకచక్యంగా నిఘా పెట్టి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వారిని విచారిస్తూ గంజాయి ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరికి సరఫరా చేస్తున్నారు? ఈ వ్యవహారం వెనుక మరెవరైనా ఉన్నారా? అనే కోణాల్లో ఆరా తీస్తున్నట్లు సమాచారం. ఈ వ్యవహారంలో మరిన్ని...

వర్ధన్నపేటలో గంజాయి కలకలం.. అసలు కథేంటి?

నిత్యం నిఘా,వర్ధన్నపేట:.. పట్టణంలో గంజాయి వినియోగం, విక్రయాలపై ఆరోపణలు నిఘా పెంచాలని స్థానికుల డిమాండ్.. అధికారిక వివరాల కోసం ఎదురుచూపు వర్ధన్నపేట పట్టణంలో గంజాయి వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. పట్టణంలో గంజాయి వినియోగం, విక్రయాలకు సంబంధించి పలు ఆరోపణలు, అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో స్థానికంగా ఈ వ్యవహారంపై చర్చ సాగుతోంది. గంజాయి పట్టణంలోకి ఎక్కడి నుంచి వస్తోంది? ఎవరు సరఫరా చేస్తున్నారు? విక్రయాల వెనుక ఎవరైనా ఉన్నారా? అనే అంశాలపై స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రస్తుతం వినిపిస్తున్న ఆరోపణలకు సంబంధించి అధికారికంగా...

కస్తూర్బా పాఠశాలలో వేడినీళ్ల ప్రమాదం!

నిత్యం నిఘా ,(వర్ధన్నపేట/ ఇల్లంద):. వంట సిబ్బందిపై ఒక్కసారిగా వేడినీళ్లు.. తీవ్ర గాయాలు ఇల్లంద కస్తూర్బా పాఠశాలలో ఘటన.. హుటాహుటిన ఆసుపత్రికి తరలింపు ఇల్లందలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో వంట సిబ్బందికి అనుకోని ప్రమాదం చోటుచేసుకుంది. వంట పనులు నిర్వహిస్తున్న సమయంలో విజయలక్ష్మిపై ప్రమాదవశాత్తు వేడినీళ్లు పడటంతో ఆమె తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. దీంతో పాఠశాలలో ఒక్కసారిగా కలకలం నెలకొంది. వేడినీళ్లు పడటంతో గాయపడిన విజయలక్ష్మిని తోటి సిబ్బంది వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమెకు వైద్యులు చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. —...

సీకేఎం ఆసుపత్రిలో కుక్కల బెడద

నిత్యం నిఘా,వరంగల్: ఆసుపత్రి ప్రాంగణంలో యథేచ్ఛగా సంచరిస్తున్న వీధి కుక్కలు రోగులు, సహాయకుల్లో ఆందోళన.. ఆసుపత్రి యాజమాన్యం స్పందించాలని డిమాండ్ వరంగల్‌లోని సీకేఎం ఆసుపత్రిలో వీధి కుక్కల బెడద రోగులు, వారి సహాయకులకు ఆందోళన కలిగిస్తోంది. ఆసుపత్రి ప్రాంగణంలోకి కుక్కలు యథేచ్ఛగా ప్రవేశించి సంచరిస్తుండటంతో రోగులు, వారి వెంట వచ్చే కుటుంబ సభ్యులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. ఆసుపత్రికి ప్రతిరోజూ పెద్ద సంఖ్యలో రోగులు, వారి సహాయకులు వస్తుంటారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో కుక్కలు గుంపులుగా సంచరిస్తుండటంతో ఆసుపత్రి ప్రాంగణంలో భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది....

తోకల మధునమ్మ ప్రథమ వర్ధంతి సభలో నిత్యం నిఘా బృందం

నిత్యం నిఘా,వరంగల్:. • ప్రథమ వర్ధంతి సభలో పాల్గొని నివాళులర్పించిన చీఫ్ ఎడిటర్ బూర నగేష్ గౌడ్, మీడియా మిత్రులు వరంగల్, సెప్టెంబర్‌ 27 (నిత్యం నిఘా ప్రతినిధి): ఏఎన్ఐ న్యూస్ వరంగల రిపోర్టర్, టీఎస్‌జేయూ ప్రధాన కార్యదర్శి తోకల అనిల్ కుమార్ తల్లి, కీర్తిశేషులు తోకల మధునమ్మ ప్రథమ వర్ధంతి కార్యక్రమంలో నిత్యం నిఘా చీఫ్ ఎడిటర్ బూర నగేష్ గౌడ్,టిఎస్ జేయు హన్మకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి దొరి హరికృష్ణ మరియు TUWJ(143) TEMJU హన్మకొండ జిల్లా అధ్యక్షులు, ఐ న్యూస్...

కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలు భావితరాలకు స్ఫూర్తిదాయకం

నిత్యం నిఘా (ములుగు జిల్లా/తాడ్వాయి): • జయంతి సందర్భంగా కాటాపురం లో విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు.. తెలంగాణ ఉద్యమ నేత, స్వాతంత్ర్య సమరయోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా తాడ్వాయి మండలం కాటాపురం గ్రామంలో ఆయన విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు కొండా లక్ష్మణ్ బాపూజీ చేసిన సేవలను స్మరించుకున్నారు. తెలంగాణ ప్రజల హక్కుల కోసం ఆయన చేసిన పోరాటం, సమాజ సేవకు అంకితమైన ఆయన జీవితం భావితరాలకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. బాపూజీ...

చెప్పులు ధరించి అంబేద్కర్ విగ్రహం వద్దకు వెళ్లడంపై ఎంపీ చామల వివరణ

నిత్యం నిఘా, జనగాం :. తొందరపాటులో అనుకోకుండా జరిగింది.. వెంటనే చెప్పులు తొలగించి నివాళులు సంఘటనపై దళితులు, అంబేద్కర్ అభిమానులకు ఎంపీ హృదయపూర్వక క్షమాపణ. జనగామ నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన భువనగిరి పార్లమెంట్ సభ్యుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అయితే కార్యక్రమం సందర్భంగా తాను తొందరపాటులో పాదరక్షలు తొలగించకుండానే విగ్రహం వద్దకు వెళ్లినట్లు ఆయన తెలిపారు. విషయం గుర్తించిన వెంటనే పాదరక్షలు తొలగించి అంబేద్కర్‌కు భక్తిశ్రద్ధలతో నివాళులు...

పరకాలలో సహకార పోస్టుల భర్తీ ఎప్పుడో?

నిత్యం నిఘా,పరకాల:. ఉమ్మడి వరంగల్‌లో దాదాపు పూర్తి.. పరకాలలో మాత్రం పడకేసిన ప్రక్రియ ఆశావహుల్లో ఆందోళన.. తమ వంతు కోసం ఎదురుచూపులు పరకాల, సెప్టెంబర్ 25 (నిత్యం నిఘా ప్రతినిధి): పరకాల నియోజకవర్గంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తికాకపోవడంతో ఆశావహుల్లో ఆందోళన నెలకొంది. పదవుల కోసం ఎదురుచూస్తున్న నేతలు తమకు అవకాశం ఎప్పుడు దక్కుతుందోనని ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియ దాదాపుగా...