Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

మావోయిస్టుల రహస్య ఆయుధ డంపులపై పోలీసుల మెరుపుదాడి

మావోయిస్టుల రహస్య ఆయుధ డంపులపై పోలీసుల మెరుపుదాడి

నిత్యం నిఘా,భద్రాద్రికొత్తగూడెం జిల్లా/చర్ల:..

మావోయిస్టుల రహస్య ఆయుధ డంపులపై పోలీసుల మెరుపుదాడి

మావోయిస్టుల రహస్య ఆయుధ డంపులపై పోలీసుల మెరుపుదాడి - Additional Image

అటవీ ప్రాంతంలో మూడు డంపుల గుర్తింపు.. ఒక డంపులో 280 బీజీఎల్ షెల్స్ స్వాధీనం

లొంగిపోయిన మావోయిస్టులు ఇచ్చిన సమాచారంతో చర్ల పోలీసుల సంయుక్త గాలింపు

మావోయిస్టుల రహస్య ఆయుధ నిల్వల గుర్తింపుపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. లొంగిపోయిన మావోయిస్టులు అందించిన సమాచారంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల పోలీసులు, స్పెషల్ పార్టీ సిబ్బంది, బాంబు నిర్వీర్య బృందం (బీడీ టీమ్) సంయుక్తంగా చేపట్టిన గాలింపు చర్యల్లో తెలంగాణ–ఛత్తీస్‌గఢ్ సరిహద్దు అటవీ ప్రాంతంలో సీపీఐ మావోయిస్టు పార్టీ పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (పీఎల్‌జీఏ) బెటాలియన్‌కు చెందిన మూడు ఆయుధ డంపులను గుర్తించారు. వీటిలో ఒక డంపు నుంచి 280 బీజీఎల్ షెల్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

పోలీసుల వివరాల ప్రకారం.. 2025లో పీఎల్‌జీఏ బెటాలియన్ వికేంద్రీకరణ జరిగిన సమయంలో మొదటి కంపెనీకి చెందిన బీజీఎల్ షెల్స్‌ను అటవీ ప్రాంతంలో రహస్యంగా దాచిపెట్టారు. దట్టమైన అడవిని సురక్షిత స్థావరంగా భావించిన మావోయిస్టులు భవిష్యత్తు అవసరాల కోసం ఈ పేలుడు సామగ్రిని డంపుల్లో నిల్వ చేసినట్లు పోలీసులు తెలిపారు.

2025 చివరి భాగం నుంచి 2026 ప్రారంభం వరకు పలువురు మావోయిస్టులు తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న లొంగుబాటు, పునరావాస విధానానికి ఆకర్షితులై జనజీవన స్రవంతిలోకి వచ్చిన మాజీ మావోయిస్టులు అందించిన సమాచారంతో పోలీసులు అటవీ ప్రాంతాల్లో గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. ఈ క్రమంలోనే రహస్య ఆయుధ డంపుల ఆచూకీ లభించినట్లు వెల్లడించారు.

లొంగిపోయిన మావోయిస్టులకు నగదు బహుమతులతో పాటు ఇంటి స్థలం, స్వయం ఉపాధి అవకాశాలు, బ్యాంకు రుణాలు, ఆరోగ్య రక్షణ పథకం కింద ఆరోగ్య కార్డులు వంటి పునరావాస సదుపాయాలు కల్పిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. వారి జీవనోపాధికి అవసరమైన సహకారాన్ని ప్రభుత్వం అందిస్తోందని పేర్కొన్నారు.

మావోయిస్టు పార్టీ అగ్రనేత ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతితో పాటు ఇంకా అజ్ఞాతంలో ఉన్న ఇతర మావోయిస్టులు కూడా హింసాత్మక మార్గాలను వీడి జనజీవన స్రవంతిలోకి రావాలని తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

ఈ సంయుక్త ఆపరేషన్‌లో జిల్లా డీఎస్పీ అరుణ్ కుమార్, చర్ల సీఐ రాజు వర్మ, ఎస్‌ఐ నర్సిరెడ్డి, సీఆర్‌పీఎఫ్ అధికారులు, ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.