Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

*వర్ధన్నపేటలో కలకలం.. చైర్మన్ ఇంటి ముందు యువతి నిరసన!*

*వర్ధన్నపేటలో కలకలం.. చైర్మన్ ఇంటి ముందు యువతి నిరసన!*

నిత్యం నిఘా, వర్ధన్నపేట:.

*“ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడు” అంటూ యువతి ఆరోపణలు*

*వర్ధన్నపేటలో కలకలం.. చైర్మన్ ఇంటి ముందు యువతి నిరసన!* - Additional Image

*న్యాయం చేయాలంటూ కుల, మహిళా సంఘాలు–ప్రతిపక్ష నాయకులతో కలిసి ఆందోళన

ఇవి కూడా చదవండి

వర్ధన్నపేటలో ఓ యువతి చేసిన ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. వర్ధన్నపేట మున్సిపల్ చైర్మన్ పాలకుర్తి సారంగపాణి కుమారుడు పాలకుర్తి శ్రీకాంత్ ప్రేమించి వివాహం చేసుకుంటానని చెప్పి తనను మోసం చేశాడని ఆరోపిస్తూ తుమ్మల శ్రీదేవి ఆందోళనకు దిగారు.

తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ కుల సంఘాలు, మహిళా సంఘాలు, ప్రతిపక్ష నాయకులతో కలిసి చైర్మన్ ఇంటి ఎదుట నిరసన చేపట్టారు. తనకు జరిగిన అన్యాయంపై అధికారులు స్పందించి న్యాయం చేయాలని ఆమె కోరినట్లు తెలుస్తోంది.

ఈ ఘటనతో వర్ధన్నపేటలో రాజకీయ, సామాజిక వర్గాల్లో చర్చ మొదలైంది. ప్రజాప్రతినిధి కుటుంబానికి సంబంధించిన వ్యక్తిపై ఇలాంటి ఆరోపణలు రావడంతో వ్యవహారం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.

“నాకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆపేది లేదు” అంటూ యువతి, ఆమెకు మద్దతుగా నిలిచిన మహిళా సంఘాలు స్పష్టం చేశారు.