Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

ఎంఆర్‌ఓ కారు పార్కింగ్‌తో ప్రజలకు ఇబ్బందులు?

Author NITYAM NIGHA | 24 Sep 2026, 08:06 PM | హన్మకొండ
ఎంఆర్‌ఓ కారు పార్కింగ్‌తో ప్రజలకు ఇబ్బందులు?

నిత్యం నిఘా(పరకాల/నడికూడ మండలం):..

ఎంఆర్‌ఓ కారు పార్కింగ్‌తో ప్రజలకు ఇబ్బందులు?

ఎంఆర్‌ఓ కారు పార్కింగ్‌తో ప్రజలకు ఇబ్బందులు? - Additional Image

నడికూడ తహసీల్దార్ కార్యాలయం వద్ద అస్తవ్యస్త పార్కింగ్‌పై ప్రశ్నలు

ఇవి కూడా చదవండి

అధికారుల కార్యాలయానికి వచ్చే ప్రజలు లోపలికి వెళ్లేందుకు ఇబ్బందులు

నడికూడ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద వాహనాల పార్కింగ్‌పై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కార్యాలయానికి వచ్చే ప్రజలు తమ సమస్యలపై అధికారులను కలిసేందుకు లోపలికి వెళ్లాల్సి ఉండగా, వాహనాల పార్కింగ్ విధానం వల్ల ప్రవేశ మార్గంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని పలువురు పేర్కొంటున్నారు.

ప్రత్యేకంగా తహసీల్దార్ వాహనం పార్కింగ్ చేసే విధానంపై ప్రజలు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. అధికారుల వాహనాల పార్కింగ్‌కు ప్రత్యేక స్థలం కేటాయించకుండా ప్రవేశ మార్గానికి ఇబ్బంది కలిగేలా వాహనాలు నిలిపితే, కార్యాలయానికి వచ్చే వృద్ధులు, మహిళలు, దివ్యాంగులు, రైతులు ఎలా లోపలికి వెళ్లాలన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.

ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన ప్రభుత్వ కార్యాలయాల్లో పార్కింగ్, ప్రవేశ మార్గాల విషయంలో అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. కార్యాలయానికి వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వాహనాల పార్కింగ్‌కు క్రమబద్ధమైన ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.