Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

సేవే సంకల్పంగా.. రక్తదానంతో ఇనగాల వెంకట్రామ్ రెడ్డి బర్త్‌డే వేడుకలు

Author NITYAM NIGHA | 06 Sep 2026, 11:17 AM | Array
    సేవే సంకల్పంగా.. రక్తదానంతో ఇనగాల వెంకట్రామ్ రెడ్డి బర్త్‌డే వేడుకలు

పరకాల, సెప్టెంబర్‌ 6 (నిత్యం నిఘా ప్రతినిధి):

హనుమకొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి 58వ జన్మదిన వేడుకలను కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. పరకాల పట్టణంలోని స్వర్ణ ఫంక్షన్ హాల్‌లో పరకాల పట్టణ, మండల, నడికూడ మండలాల కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధుల సంయుక్త ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి.

    సేవే సంకల్పంగా.. రక్తదానంతో ఇనగాల వెంకట్రామ్ రెడ్డి బర్త్‌డే వేడుకలు - Additional Image

జన్మదినాన్ని పురస్కరించుకుని ఇనగాల చారిటబుల్ ట్రస్ట్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో భారీ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఉత్సాహంగా పాల్గొని రక్తదానం చేశారు. రక్తదానం చేయడం ద్వారా ఆపదలో ఉన్న వారికి ప్రాణదానం చేసినట్లేనని నిర్వాహకులు పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

రక్తదాతలను ఇనగాల వెంకట్రామ్ రెడ్డి అభినందించి, వారికి ఇనగాల ట్రస్ట్ తరఫున టీ-షర్టులను పంపిణీ చేశారు. జన్మదిన వేడుకలను సేవా కార్యక్రమాలతో నిర్వహించడం పట్ల పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.