Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

కురవి జెడ్పీ హైస్కూల్‌లో ఆదిత్య సందడి.. విద్యార్థులతో సహపంక్తి భోజనం

Author NITYAM NIGHA | 09 Sep 2026, 07:46 AM | Politics, TELANGANA
    కురవి జెడ్పీ హైస్కూల్‌లో ఆదిత్య సందడి.. విద్యార్థులతో సహపంక్తి భోజనం

నిత్యం నిఘా,బ్యూరో:..

— కురవి జెడ్పీ హైస్కూల్‌లో ఆర్‌వో ప్లాంట్ ప్రారంభం

    కురవి జెడ్పీ హైస్కూల్‌లో ఆదిత్య సందడి.. విద్యార్థులతో సహపంక్తి భోజనం - Additional Image

— విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేసిన ఆదిత్య

ఇవి కూడా చదవండి

మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హైస్కూల్‌లో ఏర్పాటు చేసిన ఆర్‌వో ప్లాంట్‌ను తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత తనయుడు ఆదిత్య ప్రారంభించారు.

    కురవి జెడ్పీ హైస్కూల్‌లో ఆదిత్య సందడి.. విద్యార్థులతో సహపంక్తి భోజనం - Additional Image

మంగళవారం పాఠశాలను సందర్శించిన ఆదిత్య.. ఉపాధ్యాయులు, విద్యార్థులతో ముచ్చటించారు. పాఠశాలలో అందుబాటులో ఉన్న సదుపాయాలు, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ ఉద్యమం, తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో చేపట్టిన సాంస్కృతిక ఉద్యమం తదితర అంశాలపై ఉపాధ్యాయులతో చర్చించారు. బతుకమ్మ పండుగను విశ్వవ్యాప్తం చేయడంలో కల్వకుంట్ల కవిత పోషించిన పాత్ర గురించి కూడా వారితో మాట్లాడారు.

అనంతరం విద్యార్థులతో కలిసి ఆదిత్య సహపంక్తి భోజనం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ఆత్మీయంగా గడిపారు.

    కురవి జెడ్పీ హైస్కూల్‌లో ఆదిత్య సందడి.. విద్యార్థులతో సహపంక్తి భోజనం - Additional Image