Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

పర్వతగిరిలో ఉపాధ్యాయుడి అనుమానాస్పద మృతి!

Author NITYAM NIGHA | 11 Sep 2026, 01:22 PM | క్రైం న్యూస్, వరంగల్
పర్వతగిరిలో ఉపాధ్యాయుడి అనుమానాస్పద మృతి!

నిత్యం నిఘా,బ్యూరో,వరంగల్/పర్వతగిరి :…


— అద్దె ఇంట్లో విగతజీవిగా కనిపించిన గిరిజన ఆశ్రమ పాఠశాల టీచర్‌ భీమా నాయక్‌

వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. మండలంలోని కల్లెడ గ్రామంలో ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్న పర్వతగిరి గిరిజన ఆశ్రమ పాఠశాల ఉపాధ్యాయుడు భీమా నాయక్‌ అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపింది.

ఇవి కూడా చదవండి

అద్దె ఇంట్లో ఆయన మృతిచెందిన విషయం వెలుగులోకి రావడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. భీమా నాయక్‌ మృతికి గల కారణాలు ప్రస్తుతం మిస్టరీగా మారాయి.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నట్లు సమాచారం. మృతికి సహజ కారణమా? లేక మరేదైనా కారణం ఉందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టే అవకాశం ఉంది.

భీమా నాయక్‌ మృతికి సంబంధించిన పూర్తి వివరాలు, పోలీసుల దర్యాప్తు అనంతరం వెల్లడికావాల్సి ఉంది.