Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

జాతీయ స్థాయికి ఎదగాలి

Author NITYAM NIGHA | 15 Sep 2026, 03:06 PM | TELANGANA, క్రీడలు
జాతీయ స్థాయికి ఎదగాలి

నిత్యం నిఘా,జనగాం:..


— క్రమశిక్షణతో నిరంతర సాధన చేస్తూ క్రీడా నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి


జిల్లా స్థాయి కబడ్డీ ఎంపికల్లో ప్రతిభ కనబరిచి రాష్ట్ర, జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతలు సంపాదించాలని జనగామ జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు వై. కుమార్ గౌడ్ క్రీడాకారులకు సూచించారు. మంగళవారం నిర్వహించిన జనగామ జిల్లా స్థాయి కబడ్డీ ఎంపికలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఇవి కూడా చదవండి

ఈ సందర్భంగా కుమార్ గౌడ్ మాట్లాడుతూ క్రీడాకారులు క్రమశిక్షణతో నిరంతరం సాధన చేస్తూ తమ క్రీడా నైపుణ్యాన్ని మెరుగుపరుచుకోవాలని సూచించారు. పట్టుదల, క్రమశిక్షణ, నిరంతర శ్రమతో ఉత్తమ క్రీడాకారులుగా ఎదిగి రాష్ట్ర, జాతీయ స్థాయిలో జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

కార్యక్రమంలో జనగామ మైనారిటీ కళాశాల ప్రిన్సిపాల్ అనిల్ బాబు, అసోసియేషన్ చైర్మన్ పోగుల సారంగపాణి, ప్రధాన కార్యదర్శి తోటకూరి గట్టయ్య, కోశాధికారి ఎదునూరి ఉప్పలయ్య, కౌడాగాని మోహన్ రావు, బండి కుమార్, వ్యాయామ ఉపాధ్యాయులు సీహెచ్. సుధాకర్, ఏ. కుమార్, ఎన్. రాజు, జే. రాజు, సందీప్, సురేష్, సాంబరాజు, వివిధ మండలాల వ్యాయామ ఉపాధ్యాయులు, మండలాల కబడ్డీ అసోసియేషన్ బాధ్యులు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.