Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

పసర సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం

Author NITYAM NIGHA | 25 Sep 2026, 09:04 AM | క్రైమ్, ములుగు
పసర సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం

నిత్యం నిఘా (ములుగు జిల్లా,తాడ్వాయి):..

సూపర్ లగ్జరీ బస్సు–బొలెరో ఢీ.. పలువురికి తీవ్ర గాయాలు

పసర సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం - Additional Image

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

ఇవి కూడా చదవండి

ములుగు జిల్లా తాడ్వాయి మండలం పసర సమీపంలోని కొండపర్తి వద్ద 163వ జాతీయ రహదారిపై శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హనుమకొండ నుంచి గుంటూరు వైపు వెళ్తున్న సూపర్ లగ్జరీ బస్సు రాంగ్ రూట్‌లో వచ్చి బొలెరో వాహనాన్ని ఢీకొట్టినట్లు ప్రాథమిక సమాచారం.

ఈ ప్రమాదంలో బొలెరో వాహనంలో ఉన్న పలువురికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను సమీపంలోని ప్రాథమిక వైద్య కేంద్రానికి తరలించినట్లు సమాచారం. ప్రమాదం కారణంగా కొద్దిసేపు జాతీయ రహదారిపై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ప్రమాదానికి గల పూర్తి కారణాలు, గాయపడిన వారి వివరాలు, వారి పరిస్థితిపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది.