Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

ప్రమాదంలో గాయపడిన కాంగ్రెస్‌ సీనియర్‌ నేత నేపాల్‌ రెడ్డికి జంగా రాఘవరెడ్డి పరామర్శ

Author NITYAM NIGHA | 06 Sep 2026, 01:15 PM | Politics, TELANGANA
ప్రమాదంలో గాయపడిన కాంగ్రెస్‌ సీనియర్‌ నేత నేపాల్‌ రెడ్డికి జంగా రాఘవరెడ్డి పరామర్శ

స్టేషన్‌ ఘన్‌పూర్‌, సెప్టెంబర్‌ 6 (నిత్యం నిఘా ప్రతినిధి):

స్టేషన్‌ ఘన్‌పూర్‌ నియోజకవర్గం ఉనికిచర్ల గ్రామానికి చెందిన కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు, ఆత్మీయ మిత్రుడు పల్లె నేపాల్‌ రెడ్డి ఇటీవల బైక్‌ ప్రమాదానికి గురై చికిత్స అనంతరం స్వగృహానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఆయిల్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ జంగా రాఘవరెడ్డి ఆదివారం ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు.

ప్రమాదంలో గాయపడిన కాంగ్రెస్‌ సీనియర్‌ నేత నేపాల్‌ రెడ్డికి జంగా రాఘవరెడ్డి పరామర్శ - Additional Image

నేపాల్‌ రెడ్డి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న జంగా రాఘవరెడ్డి.. త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ కష్ట సమయంలో నేపాల్‌ రెడ్డి కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

ఇవి కూడా చదవండి

నేపాల్‌ రెడ్డి కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పిన జంగా రాఘవరెడ్డి.. ఆయన ఆరోగ్యం త్వరగా మెరుగుపడాలని ఆకాంక్షించారు. జంగా రాఘవరెడ్డి పరామర్శతో కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు.