Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

కుమ్మరులకు కేటాయించిన రెండు ఎకరాల భూమికి హద్దులు చూపించాలి

కుమ్మరులకు కేటాయించిన రెండు ఎకరాల భూమికి హద్దులు చూపించాలి

కుమ్మరులకు కేటాయించిన రెండు ఎకరాల భూమికి హద్దులు చూపించాలి

మా భూమిలో ఇతరులకు భూమిపూజ చేయొద్దు.. కులాల మధ్య చిచ్చు పెట్టొద్దు

తెలంగాణ రాష్ట్ర కుమ్మర సంఘం హనుమకొండ జిల్లా అధ్యక్షులు విజ్ఞప్తి

హన్మకొండ,సెప్టెంబర్ 06:

హనుమకొండ నగరంలోని 54వ డివిజన్‌ పోచమ్మకుంట ప్రాంతంలో కుమ్మరుల కోసం కేటాయించిన రెండు ఎకరాల భూమి విషయంలో అధికారులు, ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించాలని తెలంగాణ రాష్ట్ర కుమ్మర సంఘం హనుమకొండ జిల్లా నాయకులు కోరారు.

ఇవి కూడా చదవండి

కుమ్మరుల సంక్షేమం కోసం గతంలో కేటాయించిన రెండు ఎకరాల భూమికి సంబంధించి తమ వద్ద ఉన్న అప్రూవల్‌ కాపీలను సంబంధిత ప్రజాప్రతినిధులు, అధికారులకు అందజేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ముందుగా తమకు కేటాయించిన భూమికి స్పష్టమైన హద్దులు చూపించి, భూమిని తమకు అప్పగించిన అనంతరం మిగతా భూమికి సంబంధించి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా తమకు అభ్యంతరం లేదని స్పష్టం చేశారు.

అయితే తమకు కేటాయించిన భూమిని ఇతర కమ్యూనిటీకి కేటాయించడం లేదా అక్కడ ఇతరులకు భూమిపూజ చేయడం సరికాదని అన్నారు. అలా చేయడం వల్ల కులాల మధ్య అనవసరమైన అపోహలు, విభేదాలు ఏర్పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

తమ హక్కుగా భావిస్తున్న రెండు ఎకరాల భూమికి ముందుగా సర్వే నిర్వహించి, హద్దులు నిర్ణయించి, తమకు అప్పగించాలని కోరారు. ఈ ప్రక్రియ పూర్తయ్యే వరకు ఆ స్థలంలో ఇతరులకు ఎలాంటి భూమిపూజలు, కేటాయింపులు లేదా నిర్మాణ కార్యక్రమాలు చేపట్టవద్దని విజ్ఞప్తి చేశారు.

ఈ విషయంపై సంబంధిత ప్రజాప్రతినిధులు, అధికారులు తక్షణమే స్పందించి సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించాలని కోరారు. తమ విజ్ఞప్తిని పట్టించుకోకుండా ముందుకు వెళితే హనుమకొండ జిల్లాలోని కుమ్మరులు ఐక్యంగా ఉద్యమించాల్సి వస్తుందని హెచ్చరించారు. అవసరమైతే పార్టీ కార్యాలయం ఎదుట నిరాహార దీక్షలు, రాస్తారోకోలు చేపట్టేందుకు కూడా వెనుకాడబోమని స్పష్టం చేశారు.

కులాల మధ్య చిచ్చు పెట్టే విధంగా నిర్ణయాలు తీసుకోకుండా, అన్ని వర్గాల హక్కులను గౌరవిస్తూ సమస్యను పరిష్కరించాలని తెలంగాణ రాష్ట్ర కుమ్మర సంఘం హనుమకొండ జిల్లా నాయకులు కోరారు.

— తెలంగాణ రాష్ట్ర కుమ్మర సంఘం
హనుమకొండ జిల్లా