Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తొలగించడం బీసీల అణచివేతే

Author NITYAM NIGHA | 07 Sep 2026, 04:03 AM | Politics, TELANGANA
కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తొలగించడం బీసీల అణచివేతే

కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తొలగించడం బీసీల అణచివేతే

– జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు అమరవేణి నర్సాగౌడ్

నిర్మల్ ,సెప్టెంబర్ 06:

బీసీ సామాజిక వర్గానికి చెందిన మహిళా మంత్రి కొండా సురేఖను కాంగ్రెస్ పార్టీ మంత్రి పదవి నుంచి తొలగించడం దుర్మార్గమైన చర్య అని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు అమరవేణి నర్సాగౌడ్ విమర్శించారు. ఈ చర్యను తమ సంఘం తీవ్రంగా ఖండిస్తోందన్నారు.

ఇవి కూడా చదవండి

కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు బడుగు, బలహీన వర్గాలకు ప్రాధాన్యం ఇస్తామని, బీసీ ఎజెండాను అమలు చేస్తామని కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ ప్రకటించిందని గుర్తుచేశారు. అయితే ఇప్పటివరకు బీసీ ఎజెండాను అమలు చేయకపోగా, బీసీ సామాజిక వర్గానికి చెందిన ప్రజాప్రతినిధుల విషయంలో వివక్ష చూపుతున్నారని ఆరోపించారు.

కాంగ్రెస్ పార్టీలోని కొందరు అగ్రకుల నేతలు ముఖ్యమంత్రి, పార్టీపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన సందర్భాల్లో చర్యలు తీసుకోలేదని, కొండా సురేఖ కుమార్తె చేసిన వ్యాఖ్యలకు ఆమెను బాధ్యురాలిగా చేస్తూ మంత్రి పదవి నుంచి తొలగించడం సరికాదన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యలకు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు.

అగ్రకులాలకు ఒక న్యాయం, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు మరో న్యాయం చేసే విధానం సరైంది కాదన్నారు. ఈ విషయాన్ని కాంగ్రెస్‌లోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ప్రజాప్రతినిధులు గుర్తించి కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తొలగించడాన్ని ఖండించాలని పిలుపునిచ్చారు.

కొండా సురేఖకు మంత్రి పదవిని వెంటనే పునరుద్ధరించి బీసీల ఆత్మగౌరవాన్ని కాపాడాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రానున్న రోజుల్లో బడుగు, బలహీన వర్గాల ప్రజల నుంచి కాంగ్రెస్ పార్టీ తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం నిర్మల్ జిల్లా అధ్యక్షుడు అనుముల భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.