Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

మహిళా ఎమ్మెల్యేలపై దాడి చేస్తే పోలీసుల పరిశీలన ఎందుకు?

Author NITYAM NIGHA | 08 Sep 2026, 11:45 AM | TELANGANA, హైదరాబాద్

గౌరవ సభ కాదు.. కౌరవ సభ: హరీశ్‌రావు

హైదరాబాద్‌, సెప్టెంబర్‌08:

మహిళా ఎమ్మెల్యేలపై దాడి జరిగినా పోలీసులు చర్యలు తీసుకోకుండా, బాధితులపైనే కేసులు నమోదు చేశారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆరోపించారు. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, కోవా లక్ష్మీలపై దాడి చేశారని, అయితే పోలీసులు ఉల్టా వారిపైనే కేసులు పెట్టారని ఆయన విమర్శించారు.

ఇవి కూడా చదవండి

మహిళా ఎమ్మెల్యేలపై జరిగిన దాడి ఘటనను పోలీసులు పరిశీలిస్తారని మంత్రి చెబుతున్నారని, మరి దాడి చేసిన వారిపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని హరీశ్‌రావు ప్రశ్నించారు.

తెలంగాణ అసెంబ్లీని ఉద్దేశిస్తూ ఇది గౌరవ సభ కాదని, కౌరవ సభగా మారిందని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి “కలియుగ దుశ్శాసనుడు” అంటూ హరీశ్‌రావు ఘాటు విమర్శలు చేశారు.

అసెంబ్లీ పరిసరాల్లో చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం మరింత తీవ్రతరమవుతోంది.